క్రిష్ పెళ్లిలో మంచు లక్ష్మి ఏం చేసిందో చూడండి


క్రిష్ పెళ్లిలో మంచు లక్ష్మి ఏం చేసిందో చూడండి

Manchu Lakshmi
మంచు లక్ష్మి ఏం చేసినా వెరైటీగానే ఉంటుంది. ఆమె తెలుగు మాట్లాడినా.. ఏదైనా సినిమాలో నటించినా.. ఏదైనా టీవీ షో చేసినా.. ఆమె ‘ముద్ర’ స్పష్టంగా కనిపిస్తుంది. గుంపులో గోవిందా అన్నట్లు ఉండటం ఆమెకు ఇష్టముండదు. తాను ఎక్కడున్నా అందరి ఫోకస్ తన మీద ఉండేలా చూసుకుంటుంది లక్ష్మి. కెమెరాల దృష్టిని ఎలా ఆకర్షించాలో ఆమెకు బాగా తెలుసు. నిన్న రాత్రి జరిగిన డైరెక్టర్ క్రిష్ పెళ్లిలో కూడా మంచు లక్ష్మి స్పెషల్ అట్రాక్షన్ అయింది. ఓ టీనేజీ అమ్మాయిలా తయారై వచ్చి అందరి దృష్టిని ఆకర్షించిన లక్ష్మి.. ఆ తర్వాత పెళ్లికొడుకును తనదైన శైలిలో గ్రీట్ చేసి వివాహ వేడుకకు హాజరైన వాళ్లందరికీ పెద్ద షాకిచ్చింది.

అందరూ వెళ్లి క్రిష్కు షేక్ హ్యాండ్ ఇచ్చి వస్తుంటే లక్ష్మి మాత్రం నేరుగా వెళ్లి అతడి తొడమీద కూర్చునేయడంంతో అందరూ అవాక్కయ్యారు. క్రిష్ కూడా ఈ పరిణామానికి ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాడు. సిగ్గుతో నవ్వేశాడు. ఆమెను లేపే ప్రయత్నం చేశాడు. మంచు లక్ష్మి ఇలా చేస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. క్రిష్ కు లక్ష్మి మరీ అంత గొప్ప ఫ్రెండేమీ కాదు. మనోజ్ తో ‘వేదం’ చేశాడు కానీ.. లక్ష్మితో సినిమా ఏమీ చేయలేదు క్రిష్. అయినా లక్ష్మి చిన్నప్పట్నుంచి పరిచయమున్న ఫ్రెండుతో ప్రవర్తించినట్లు ఇలా చేసేసరికి జనాలు అవాక్కయ్యారు. లక్ష్మి చేసిందానికి క్రిష్ ఎలా ఫీలయ్యాడో కానీ.. ఆయన సతీమణి రమ్య మాత్రం సరదాగా నవ్వుకుని లైట్ తీసుకుంది.